చిట్యాలలో ఆదివారం మహాసభల గోడ పత్రికలను పార్టీ మండల కమిటీ సభ్యులతో కలిసి జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య విడుదల చేశారు. సంగారెడ్డిలో జనవరి 25 నుండి 28 వ తేదీ వరకు సీపీఎం రాష్ట్ర మహాసభలు జరగనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మహాసభల ప్రారంభ సూచకంగా ఈ నెల 25 న గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.