నల్లగొండలో చేపట్టిన రైతు మహా ధర్నాలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలన్నీ ఉత్తి మాటలు అని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్ విమర్శించారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.