చింతపల్లి: హెచ్‌సీని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

64చూసినవారు
చింతపల్లి: హెచ్‌సీని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఆరోగ్య సమస్యలు రాకుండా మహిళలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎప్పటిలాగే ఓపి రిజిస్టర్, సిబ్బంది హాజరు రిజిస్టర్, ఇన్ పేషెంట్లు, ఔట్ పేషెంట్లు, మందులు, ఇతర స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు. బుధవారం ఓపి పేషంట్ల వివరాలను డాక్టర్ శ్రీదేవితో అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్