కేతేపల్లి మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, సిబ్బంది పనితీరు బాగుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా, కేతేపల్లి మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. సిబ్బంది అందరూ సకాలంలో ఆసుపత్రికి రావాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు.