హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని, సుప్రీం కోర్టుకు అప్పీల్‌కు వెళ్తున్నందున తీర్పు వచ్చే వరకు బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూల్చవద్దని ఆ పార్టీ నాయకులు కోరారు. గురవారం బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, పార్టీ నాయకులు చెరుకు సుధాకర్, నిరంజన్ వలీ, చీర పంకజ్‌యాదవ్ తదితరులు మాట్లాడారు.