ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలి: సీహెచ్ఒ హారిక

2376చూసినవారు
ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలి: సీహెచ్ఒ హారిక
ప్రజలు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్‌ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వంటివి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రతీ శుక్రవారం అందరూ డ్రైడే పాటించాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ హారిక పేర్కొన్నారు. శుక్రవారం ఆమె ఉట్లపల్లి గ్రామంలో వివిధ వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె స్థానికులతో మాట్లాడుతూ.. ఇళ్లలో వాడే కుండీలలోని నీటిని రెండు రోజులకొకసారి మార్చాలని, ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచకూడదని, కొబ్బరిబొండాలు, ప్లాస్టిక్‌ వంటి వస్తువులు ఇళ్ల పరిసరాల్లో ఉంచకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త ఆశ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్