అమరుడు శ్రీ కాంతా చారి ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా నల్లగొండ గడియారం సెంటర్లోని వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాంతాచారి ప్రాణత్యాగంతోనే తెలంగాణ ఉద్యమం మరింత బలపడి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మూలం అయిందని అన్నారు.