తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. తాజాగా మంగళవారం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల మోడల్ స్కూల్ మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మౌనిక, పూజిత, మల్లీశ్వరి, ముగ్గురు విద్యార్ధినులు అస్వస్థత గురయ్యారు. ఇది గమనించిన టీచర్లు వారిని హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. కాగా ప్రస్తుతం ముగ్గురు విద్యార్దులకు వైద్యం అందిస్తున్నారు