సమాజంలో ప్రతి ఒక్కరూ స్వేచ్చా, స్వాతంత్ర్యాలు కలిగి ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని, అందుకోసమే గాంధీ మహాత్ముడు కృషి చేశారని ప్రిన్సిపల్ స్టేషన్స్ జిల్లా జడ్జి ఎం. నాగరాజు అన్నారు. గాంధీ జయంతి మరియు ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నల్గొండ జిల్లా జైలులో ఏర్పాటు చేసిన ఖైదీల సంక్షేమ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీటితోపాటు జిల్లా కలెక్టర్ ఎస్పీ తదితరులు పాల్గొన్నారు.