శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలోని శ్రీ పార్వతీ శంభో లింగేశ్వర స్వామి ఆలయంలోని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈనెల 5న నిర్వహించే కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యే మందుల సామేలు కు వల్లాల గ్రామస్తులు ఆహ్వాన పత్రికను అందజేశారు. స్వామి, అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు, అలంకరణ, శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో మన్యు సూక్త పారాయణం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉల్లాల గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.