నల్గొండ కేశరాజుపెల్లి వద్ద గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం డీసీసీ బ్యాంక్ డైరెక్టర్, తిప్పర్తి పీఏసీఎస్ ఛైర్మన్ పాశం సంపత్ రెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేసి, ఖాతాలో 48 గంటలలో డబ్బులు జమ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు.