రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం పేదవాడి ఆత్మగౌరవ పథకం అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఆయన నల్గొండ జిల్లా, నార్కెట్ పల్లి మండలం, ఎల్లారెడ్డిగూడెంలో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంతో కలిసి సన్న బియ్యం లబ్ధిదారు మేడి అరుణ ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. సన్న బియ్యం పేదవారి ఆత్మగౌరవ పథకం అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.