జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించడంతో పాటు సమస్యల పరిష్కారానికి తమవంతుగా కృషి చేస్తామని బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కమిటీ కార్యవర్గం శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో వారిని కలిసి జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఇళ్ల స్థలాలను కేటాయించడం కోసం కృషి చేస్తామన్నారు.