ఏపీలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యకలాపాలను విస్తరించడానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం విజయవాడలోని టీచర్స్ కాలనీలో ట్రస్ట్ భవన నిర్మాణానికి చంద్రబాబు నాయుడు సతీమణి శంకుస్థాపన చేశారు. ఈ భవనంలోనే తలసీమియా కేర్ సెంటర్, రక్త నిధి కూడా ఏర్పాటు చేయనున్నారు.