బయటపడిన పోస్టల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం

67చూసినవారు
బయటపడిన పోస్టల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం
ఖమ్మం జిల్లాలో పోస్టల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. పదో తరగతి జవాబు పత్రాల తరలింపులో జాగ్రత్తలు పాటించలేదు. హెడ్ పోస్ట్ ఆఫీస్‌కు తరలిస్తుండగా పార్సిల్ బస్తాలు చిరిగి, ఆన్సర్ షీట్ బండిల్స్ బయటపడి నలిగిపోయాయి. దీంతో జవాబు పత్రాలు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇది మూల్యాంకనంలో విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశాన్ని కలిగిస్తుంది.

సంబంధిత పోస్ట్