TG: హైదరాబాద్‌లో రూ.450 కోట్లతో అత్యాధునిక ఐటీ పార్క్ నిర్మించేందుకు ముందుకు వచ్చిన క్యాపిటల్‌ల్యాండ్ నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. రూ.450 కోట్లతో క్యాపిటల్‌ల్యాండ్ గ్రూపు చేపట్టే ఈ కొత్త ఐటీ పార్క్ హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. బ్లూ చిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేలా అన్ని సౌకర్యాలను క్యాపిటల్‌ల్యాండ్ నిర్మించే ఐటీ పార్కులో అందుబాటులో ఉంటాయి.