ఈ మధ్య కాలంలో గుండెపోటుతో చాలామంది ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోతున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని రాజ్‌సమండ్‌లో 27 ఏళ్ల యువకుడికి నిలబడి ఉండగానే గుండెపోటు వచ్చింది. ఈ సంఘటన మార్చి 1న జరిగినట్లు చెబుతున్నారు. సచిన్ (27) రెస్టారెంట్‌లో బిల్లు కట్టడానికి నిలుచుని ఉండగా ఒక్కసారిగా గుండెపోటుతో అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన మొత్తం రెస్టారెంట్‌లో ఉన్న సీసీటీవీలో రికార్డైంది. కాగా, ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.