వివేకా హత్య కేసు.. నలుగురు సాక్షులు మృతి: ఎస్పీ

62చూసినవారు
వివేకా హత్య కేసు.. నలుగురు సాక్షులు మృతి: ఎస్పీ
AP: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్షిగా రంగన్న(70) మృతి కేసుపై వైఎస్‌ఆర్‌ జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌ పలు కీలక విషయాలు వెల్లడించారు. వివేకా హత్య కేసులో ఇప్పటివరకు నలుగురు సాక్షులు మరణించారని తెలిపారు. శ్రీనివాసులరెడ్డి, గంగాధర్‌ రెడ్డి, అభిషేక్‌ రెడ్డి, రంగన్న మృతి చెందారని ఎస్పీ పేర్కొన్నారు. వీరంతా అనుమానాస్పద రీతిలో మృతి చెందారని, సాక్షులంతా వరుసగా చనిపోవడంపై అనుమానాలున్నాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్