రాజధానిని మూడేళ్లలో పూర్తిచేస్తాం: మంత్రి నారాయణ

52చూసినవారు
రాజధానిని మూడేళ్లలో పూర్తిచేస్తాం: మంత్రి నారాయణ
ఏపీ రాజధాని అమరావతిని మూడేళ్లలో పూర్తిచేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అమరావతిలో గురువారం ఆయన మాట్లాడారు. ప్రజలు కట్టే పన్నుల నుంచి ఒక్క పైసా రాజధానికి ఖర్చు చేయమని ఆయన స్పష్టం చేశారు. హడ్కో, ప్రపంచ బ్యాంకు రుణాలతో రాజధానిని నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు. రూ.63 వేల కోట్లతో రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. అధికారంలో ఉండగా జగన్‌ మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్