ఉట్నూర్ లో భారీ వర్షం

78చూసినవారు
ఉట్నూరు మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షం కురిసింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉట్నూరు పట్టణంతో పాటు పలు గ్రామాలలో ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. అనంతరం భారీ వర్షం నమోదయింది. దాదాపు నాలుగు రోజులుగా ఉట్నూర్ మండలంలో వర్షం కురవకపోవడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. తాజాగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. వర్షం పంటలకు కూడా మేలు చేస్తుందని రైతుల తెలిపారు.

సంబంధిత పోస్ట్