ఉట్నూర్ లో భారీ వర్షం నమోదు

74చూసినవారు
ఉట్నూర్ మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షం కురిసింది. మంగళవారం మ. 3 గంటల ప్రాంతంలో ఉట్నూర్ పట్టణంతో పాటు పలు గ్రామాలలో ఈదురు గాలులతో భారీ వర్షం నమోదయింది. వర్షాకాలం ప్రారంభమై మూడు రోజులు కావస్తున్న వర్షాలు పడకపోవడంతో ప్రజలు ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడ్డారు. తాజాగా కురిసిన వర్షంతో చల్లటి వాతావరణం ఏర్పడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్