జన్నారం: 10న కళాకారుల పాటల బాట

56చూసినవారు
జన్నారం: 10న కళాకారుల పాటల బాట
తెలంగాణ నిరుద్యోగ కళాకారులకు న్యాయం చేయాలని కోరుతూ జనవరి 10న మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరుద్యోగ కళాకారుల పాటల బాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ధూమ్ ధాం కళాకారులు లింగంపల్లి రాజలింగం తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తమకు న్యాయం జరగలేదన్నారు. జనవరి 10న మంచిర్యాలలో కళాకారుల పాటల బాట కార్యక్రమము ఉంటుందని, దీనికి తెలంగాణ ప్రాంతాల నుండి కళాకారులు వస్తారన్నారు.

సంబంధిత పోస్ట్