కడెం మండలం పెద్దూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మునీర్ ఉల్ హసన్ పై చర్యలు తీసుకోవాలని మంగళవారం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పై బైఠాయించి పంచాయతీ కార్మికులు ధర్నా చేపట్టారు. గత 2 నెలల వేతనాలు ఆపి, అసభ్యకరంగఅసభ్యకరంగా మాట్లాడుతున్నారని, కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. వెంటనే పై అధికారులు స్పందించి కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.