మంచిర్యాల: మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు

52చూసినవారు
మంచిర్యాల: మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. దండేపల్లి గ్రామానికి చెందిన ప్రకాష్ అనారోగ్యంతో బాధపడుతుండడంతో వైద్య ఖర్చుల నిమిత్తం ఆయన కుటుంబ సభ్యులకు శనివారం సాయంత్రం ఆమె ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆమె అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్