పాపన్న గౌడ్ ను ఆదర్శంగా తీసుకోవాలి

81చూసినవారు
పాపన్న గౌడ్ ను ఆదర్శంగా తీసుకోవాలని కడెం మండల గౌడ సంఘం నాయకులు అన్నారు. పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం కడెం మండల కేంద్రంలోని పాపన్న గౌడ్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల సమస్యలపై పాపన్న గౌడ్ నిరంతరం పోరాడారని వారన్నారు. ఈ కార్యక్రమంలో కడెం మండల గౌడ సంఘం నాయకులు, కులస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్