మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలి

72చూసినవారు
మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలి
ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని అన్ని ఆశ్రమ పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతు పనులు పూర్తిచేయాలని పిఓ కుష్బూ గుప్త ఆదేశించారు. శుక్రవారం ఉట్నూర్ పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఆశ్రమ పాఠశాలల నిర్వాహకులు, హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు. ఆదివాసి, గిరిజన విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ఉద్దేశంతో అన్ని ఆశ్రమ పాఠశాలల్లో మరమ్మతు పనులు చేయిస్తున్నామని, ఆ పనులను పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు పూర్తి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్