మండల కేంద్రంలోని రేవోజి పేట్ గ్రామ సమీపంలో ఎక్స్ రోడ్ వద్ద వెల్గటూర్ నుండి దస్తూరాబాద్ మండల కేంద్రానికి కాంక్రీట్ తీసుకు వస్తున్న ఏపీ 29 యు 3802 గల టిప్పర్ అతి వేగంతో వస్తూ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అక్కడ ఉన్న గ్రామస్తులు స్పందించి వెంటనే వన్ డబల్ జీరో కు సంప్రదించి సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తెలియజేసారు. స్థానిక ఎస్సై జ్యోతి మణి సిబ్బందితో వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్ లక్ష్మీరాజ్యం(30) స్వల్ప గాయాలతో బయటపడగా ప్రథమ చికిత్స చేయించి అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం లక్షేపెట్ ఆసుపత్రికి తరలించారు.