డెంగ్యూ జ్వరాలపై అధికారులు చర్యలు తీసుకోవాలి

69చూసినవారు
భైంసా పట్టణంలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ అనంద్ బుద్ధ విహార్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. సాహెబ్ రావు, అంకిత్ వాగ్మారే మాట్లాడుతూ పట్టణంలో అపరిశుభ్రత వల్ల డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయని, ఇదివరకే ఒకరు చనిపోగా నేడు రెండు డెంగ్యూ కేసులు నమోదయ్యాయని అన్నారు. పట్టణంలో పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని, దోమలను నివారించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్