బాసర: నూతన వీసీని కలిసిన ఓయు విద్యార్థి జేఏసీ నేతలు

70చూసినవారు
బాసర: నూతన వీసీని కలిసిన ఓయు విద్యార్థి జేఏసీ నేతలు
బాసర అర్జీయూకేటి ఇన్ ఛార్జ్ వీసీగా నియమితులైన ప్రొఫెసర్ గోవర్ధన్ ను ఆదివారం ఓయూ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బాసర అర్జీయూకేటి సంపూర్ణ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఓయు విద్యార్థి జేఏసీ నేతలు సూర్నగంటి రంజిత్ కుమార్, ప్రవీణ్ రావు, నరహరి గౌడ్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్