బాసర మండలం మైలాపూర్ గ్రామానికి చెందిన మమ్మాయి సచిన్ అనాధలకు అన్నదాన ప్రసాదాన్ని అందజేశారు. సోమావతి అమావాస్య సందర్భంగా సచిన్ నానమ్మ, తాత మమ్మాయి భూమవ్వ ధర్మరాజ్ జ్ఞాపకార్థం 150 మంది యాత్రికులకు అన్న ప్రసాదం అందజేయడం సంతోషంగా ఉందన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్నట్టుగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలిపారు.