బైంసా పట్టణంలోని 152 వ బూత్ అధ్యక్షులు రాకేష్ ఆధ్వర్యంలో సోమవారం నేతాజీ నగర్ లో ఇంటింటికి వెళ్లి బిజెపి సభ్యత్వాన్ని నమోదు చేశారు. నిర్మల్ జిల్లా సభ్యత్వ ఇన్చార్జి, రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, ముధోల్ అసెంబ్లీ సభ్యత్వ ఇంచార్జ్ సుష్మా రెడ్డి లు ఈ కార్యక్రమంలో పాల్గొని బిజెపి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సభ్యత్వ కన్వీనర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.