ముధోల్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో 2025- 26 ఆర్థిక సంవత్సరానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టబోయే పనుల గుర్తింపు, లేబర్ బడ్జెట్ ఆమోదం గురించి గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో శివకుమార్, ఈవో ప్రసాద్ గౌడ్ ఈవో, టీఎలు యోగేశ్వర్ , శ్రీలక్ష్మి, ఎఫ్ఏ సోనీ , ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.