లోకేశ్వరం: రామ మందిర నిర్మాణానికి రూ. 50 లక్షల నిధులు మంజూరు

67చూసినవారు
లోకేశ్వరం: రామ మందిర నిర్మాణానికి రూ. 50 లక్షల నిధులు మంజూరు
లోకేశ్వరం మండలంలోని మన్మద్ గ్రామంలో రామ మందిర నిర్మాణానికి 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. భైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పృథ్వీ రాజ్ పటేల్, విడిసి అధ్యక్షులు ఆలూరి శేఖర్ రెడ్డి, నారాయణ, రాజు, శంకర్, భోజరాం, మాజీ ఎంపిటిసి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్