ఈదురుగాలుల వర్షం... రైతులకు ఇక్కట్లు

74చూసినవారు
కుంటాల మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, జొన్న కుప్పలపై టార్పాలిన్ కవర్లు కప్పేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. ఆకాల వర్షం కారణంగా కోత దశలోని వరి, నువ్వు పంటలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మొక్కజొన్న, జొన్న పంటల నూర్పిడికి ఆటంకం ఏర్పడుతోంది. తేమ పేరుతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండటంతో అవస్థలు తప్పడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్