దిలావర్పూర్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై గురువారం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడుపొద్దని తెలిపారు. వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు దగ్గర ఉంచుకోవాలన్నారు. ఈ సందర్బంగా పలువురికి బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.