జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి ర్యాలీగా తరలివచ్చి ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందించారు. మోహన్ బాబు కుటుంబ తగాదాల వల్ల న్యూస్ కవరేజ్ కు వెళ్లిన పాత్రికేయులపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. మోహన్ బాబును వెంటనే అరెస్టు చేసి అయ్యప్ప స్వాములకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.