భారత యువ క్రికెటర్, తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు నాలుగు ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు బాదేశాడు. దీంతో ఆసీస్ టూర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. 2003-24 సీజన్‌లలో సెహ్వాగ్ 6 సిక్సర్లు కొట్టాడు. మురళీ విజయ్ 2014-15 టూర్‌లో 6 సిక్సర్లతో సెహ్వాగ్‌తో సమంగా ఉన్నాడు.