పుదుచ్చేరి మాజీ సీఎం ఎండీఆర్ రామచంద్రన్(90) కన్నుమూశారు. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయన 1969లో ఎమ్మెల్యేగా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1980-83, 1990-91 మధ్య ఆయన సీఎంగా పని చేశారు. రామచంద్రన్ మృతికి ప్రస్తుత సీఎం రంగస్వామి మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.