మాట నిలబెట్టుకున్న నితీశ్‌ రెడ్డి.. వీడియో వైరల్‌

69చూసినవారు
మంగళవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో SRH విజయంలో తెలుగు కుర్రాడు నితీశ్‌రెడ్డి కీలకపాత్ర పోషించాడు. ఈ 20 ఏళ్ల ఆల్‌రౌండర్‌ కీలక సమయంలో అదిరే ఇన్నింగ్స్‌(64: 37 బంతుల్లో 4×4, 5×6) ఆడిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్‌కు ముందు అతడు మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ‘గతేడాది బౌలర్ గా చూశారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఈ సీజన్‌లో బ్యాట్‌తో అలరిస్తా’ అని చెప్పాడు. దీంతో నితీశ్‌ మాట నిలబెట్టుకున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్