ఆలూర్ మండలం గగ్గు పల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ అధ్యక్షులు రోహిత్, ఉపాధ్యక్షులు బన్నీ, నందు, భారత్, సూరజ్, మాదరి సాయన్న పాల్గొన్నారు.