ఆలూరు మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం పూలమాల వేసి ఘనంగా ఆలూరు మండల విద్యాధికారి ఎం నరేందర్ నివాళులర్పించారు. మన దేశ రాజ్యాంగాన్ని రచించిన మహానీయుడని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ అశ్వఖ్ అహ్మద్, ఫిజికల్ డైరెక్టర్ రాజేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.