ఆలూర్ మండల కేంద్రంలో మంగళవారం డీకంపల్లి గ్రామంలో గుట్టల మధ్య శివరాత్రి సందర్భంగా శివలింగం వెలవడంతో ఉదయం అటు నుంచి వెళుతున్న పశువుల కాపరు చూసారు. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో శివలింగం వెలవడం చూసి గ్రామ ప్రజలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా శివలింగం వెలువడం మా గ్రామ అదృష్టంగా భావిస్తున్నామని వారు ఆనందం వ్యక్తం చేసారు.