నందిపేట్ మండల కేంద్రంలో కేసీఆర్, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను ఆదివారం కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద మహిపాల్ మాట్లాడుతూ ఇటీవల శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్ పట్ల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. స్పీకర్ పట్ల చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.