మోర్తాడులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జాతర ఘనంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మోర్తాడ్ మండల కేంద్రంలో ఆదివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. స్వామివారి కృపతో అందరూ బాగుండాలని వేడుకుంటున్నానని చెప్పుకొచ్చారు.