జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలూరులో గణిత దినోత్సవం సందర్భంగా శుక్రవారం క్విజ్ పోటీలను నిర్వహించారు. విద్యార్థులనుద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం నరేందర్ మాట్లాడుతూ జాతీయ గణిత దినోత్సవమును శ్రీనివాస రామానుజన్ జన్మదిన సందర్భంగా జరుపుకుంటారని అన్నారు. 6వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఐదు గ్రూప్ లుగా ఏర్పడి క్విజ్ పోటీలలో పాల్గొన్నారు.