విజ్ఞానం అనేది వికసించే మానవ మేధస్సుకి దారి చూపుతుందని వికసించిన విజ్ఞానమే సమాజానికి ప్రగతి బాట వేస్తుందని సిర్పూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి సత్యనారాయణ అన్నారు. జాతీయ సైన్స్ డే సందర్భంగా సిర్పూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన దాదాపు 30 ఎగ్జిబిట్స్ ప్రత్యేకంగా నిలిచినాయి.