నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో స్వయంభు శివ మల్లన్న జాతర ఉత్సవాలు ఆదివారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వయంభు శివ మల్లన్నను దర్శించుకొనుటకు గ్రామ ప్రజలు చుట్టుపక్కల భక్తులు బోనాలు పసుపు బండారిలు తీసుకొని వచ్చి మల్లన్నను దర్శించుకుంటారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.