వేల్పూర్ మండలంలోని కుకునూరు ఉన్నత పాఠశాలలో శనివారం స్వయంపాలనా దినోత్సవాన్ని జరుపుకున్నారు. పదవ తరగతి విద్యార్థులు టీచర్లుగా మారి 6 నుండి 9వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించారు. సమయసారిణి ప్రకారం పాఠ్యాంశాలను చేపట్టి విద్యార్థులకు చక్కగా పాఠాలను బోధించారు.