నిజాలను నిర్భయంగా రాయడం ప్రముఖ పత్రిక ప్రత్యేకత అని బాల్కొండ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలంలోని తన నివాసంలో ప్రముఖ పత్రిక నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా ప్రజా సమస్యలపై నిరంతరం అక్షర రూపం ఇస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తుందని గుర్తు చేశారు.