పెంటాకలాన్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

542చూసినవారు
పెంటాకలాన్ లో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
బోధన్ మండలం పెంటాకలాన్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005 2006 పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. గడిచిన గతంలో జరిగిన మధుర జ్ఞాపకాలను ఒకరికి ఒకరు ఆత్మీయంగా తెలుసుకున్నారు. ఆత్మీయంగా పలకరించుకుంటూ కష్టసుఖాలను తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులకు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్